Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గర్ల్‌ఫ్రెండ్ కోరిక తీర్చలేదని తన బాయ్ ఫ్రెండ్ నీ పట్టుకుని ఏం చేసిందో తెలుసా?

Category : national

ఈ రోజుల్లో ఒక అమ్మాయిని పడేయడం ఎంత కష్టమో... అదే అమ్మాయిని లాంగ్ టైమ్ మెయింటెయిన్ చేయడం కూడా అంతే కష్టం. తాజాగా వైరల్ అయిన ఓ వీడియో చూస్తే... గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఎన్ని కష్టాలు ఫేస్ చేయవలసి వస్తుందో చెప్పకనే చెబుతోంది. గర్ల్ ఫ్రెండ్ అడిగిన ఫోన్ కొనివ్వలేదని... అందరూ చూస్తూ వుండగానే నడి రోడ్డు మీద బాయ్‌ఫ్రెండ్‌నీ పట్టుకుని ఆ అమ్మాయి చెంప చెళ్లుమనిపించింది సదరు గర్ల్‌ఫ్రెండ్. అదీ కూడా ఒకసారో రెండుసార్లో కాదు ... ఏకంగా 52 సార్లు చెంప మీద కొడుతూ తన కోపాన్ని చూపించింది. ఆమె అంత లా కొడుతున్న ఆ వ్యక్తి మాత్రం రాయిలా నిలబడిపోవడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని సిచువాన్‌ వీధిలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలిశాడో యువకుడు.

మే 20న చైనా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేయసితో కలిసి కాసేపు ఎంజాయ్ చేద్దామనుకుని ఆశగా వచ్చాడు. అయితే ప్రేమికుల రోజు తనకు మొబైల్ ఫోన్ కొనివ్వాలని డిమాండ్ చేసిందా గర్ల్‌ఫ్రెండ్. ఆ విషయం మరిచిపోయాడో లేక డబ్బులు లేక కొనలేకపోయాడో తెలీదు కానీ ఒట్టి చేతులతో ప్రేయసి దగ్గరికి వచ్చాడా ప్రియుడు. దాంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. జనం మధ్యలో ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి... బాయ్‌ఫ్రెండ్ చెంపచెళ్లుమనిపించింది. తిడుతూ 52 సార్లు చెంప చెళ్లుమనిపిస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కలవాళ్లు ఆపడానికి గానీ, అడిగేందుకు గానీ సాహసం చేయలేదు. కొందరు మాత్రం ఈ దృశ్యాలను మొబైళ్లలో రికార్డు చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు.

అయితే అమాయకుడైన అతను మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ ఇబ్బందుల్లో పడడం తనకిష్టం లేదని పోలీసులతో వారించాడు. మా విషయంలో పోలీసుల జోక్యం అవసరం లేదని తేల్చేశాడు. అయితే ఇద్దరినీ విడివిడిగా కూర్చొబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు... ఇంటికి పంపించివేశారు. అయితే ఆమెకు అంత కోపం రావడానికి కారణం లేకపోలేదు. కొన్నాళ్లుగా బాయ్‌ఫ్రెండ్‌కు ఆర్థికంగా సాయం చేస్తూ వచ్చిందట సదరు యువతి. అందుకే ఆశగా తనకు ప్రేమికుల రోజు జ్ఞాపికగా కొత్త ఫోన్ కావాలని అడిగిందట. అది కూడా తేకపోవడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించిందట. తప్పు చేశాననే భావనతోనే అతను మౌనంగా ఆమె కొడుతున్నా, తిడుతున్నా భరించాడట. ఈ ఇద్దరి ప్రేమకథ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయ్యింది.

Related News