హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హైదర్‌గూడలో విషాదం చోటు చేసుకుంది. హైదర్‌గూడలోని బృందావన్ అపార్ట్మెంట్లో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక బాలామణి తను పని చేస్తున్న ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన బాలామణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఇంటి యజమాని భాస్కర్, ఆయన భార్య జ్యోతి కలిసి తమ కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.