//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తలమీద పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

Category : editorial health

టెక్నాలజీ ప్రకారం ప్రపంచం ఇప్పుడు ముందుకు దూసుకు పోతుంది కానీ, శాస్త్రాల ప్రకారం కనుగొనడంలో భారత దేశము ఎప్పుడో ముందంజలో ఉంది. మనిషి జీవనవిధానానికి జీవనశైలికి సంబంధించిన ప్రతి అంశాన్ని కొన్ని వందల ఏళ్ళ క్రితం నుండే పరిపూర్ణమైన పరివర్తనాన్ని కలగజేసే ప్రతి అంశాన్నికనుగొనడం జరిగింది.సాధారణంగా ప్రతి మనిషికి పుట్టుమచ్చ ఉండటం సహజం అసలీ పుట్టు మచ్చలు ఎలా ఏర్పడతాయి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి ప్రతిఫలాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం జన్మించినప్పుడు ఉండే నల్లటి మచ్చలను పుట్టుమచ్చలు అంటారు, అయితే ఇవి ఉండే ప్రదేశాన్ని బట్టి మన వ్యక్తిత్వం,ఏంటనేది చెప్పవచ్చు అంటున్నారు పండితులు. జీవితం యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా ఉంటుందో మీ శరీరం యొక్క పుట్టుమచ్చల మండల ఆధారంగా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఇక జ్యోతిష్కులు చెప్పే దాన్నిబట్టి శరీరంపై ఉండే పుట్టు మచ్చ కూడా మన జాతకాన్ని నిర్ణయిస్తాయని అంటున్నారు, దీనికి శాస్త్రీయం ఉందని కూడా వారి గట్టి విశ్వాసం మరి తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ పదవి చేపట్టిన తిరుగుండదు, రాజకీయాల అవగాహన చాలా ఉంటుంది.

వీరికి డబ్బు విషయంలో కొదవ వుండదు. తెలివితో వ్యాపార రంగంలో రాణిస్తారు ఒకవేళ తల మీద ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే సంపాదన మీద ఆసక్తి అనేది ఉండదు. వీరికి ఇతరులకు సేవ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు మంచి చేయాలని మంచి మనసు ఉంటుంది. తల మీద ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్న వారు ఎప్పుడు సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటారు, ఒకే చోట ఎప్పుడుస్థిరం గా ఉండటానికి ఇష్టపడరు,సన్యాసం పైన వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తల వెనుక భాగంలో పుట్టు మచ్చ ఉన్నట్లైతే డబ్బు సంపాదించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. వీరి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. తల ముందు భాగంలో కనుక పుట్టు మచ్చ ఉన్నట్లైతే మీరు చెప్పినట్లు మిగతావాళ్ళు చేయాలనుకుంటారు,వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇక పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం తలకి కుడివైపున పుట్టుమచ్చ ఉన్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, తలకి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న వారు సంసార జీవితం కంటే సన్యాసి జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు.