Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డైలాగ్ కింగ్ మోహన్ బాబు పై డైలాగ్ వేసిన హీరో సూర్య..... దానికి రీ ట్వీట్ చేసిన మోహన్ బాబు.....!

Category : movies

సాధారణం గా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయిన ఒక నటుడు అంటే మరో నటుడికి మద్య సన్ని హిత సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో కొందరు మంచి ఫ్రెండ్స్ గా రిలేషన్ షిప్ ఏర్పరుచుకుంటే ఇంకొందరు అలాంటి వాటి కి దూరంగా ఉంటూ వస్తారు.అయితే ఈ నేపధ్యంలోనే చాలా మంది టాప్ స్టార్స్, యంగ్ అప్ కమింగ్ స్టార్స్ మధ్య ఇలాంటి రిలేషన్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.కానీ ఇలాంటి సమయంలోనే కొంత మంది సొంత భాషా నటుడి కంటే పక్క భాషా నటులను ప్రశంసించడం లోనూ అభిమానించడం లో కొంత వెనక్కి తగ్గుతారు కానీ.ఈ విషయంలో మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మాత్రం అలాంటి ఈక్వేషన్స్ ఏం పెట్టుకోకుండా మన తెలుగు నటున్ని ఆకాశానికి ఎత్తేశారు.ఇంతకీ ఆ నటుడు ఎవరూ అనే కదా మీ డౌట్...ఆ నటుడు ఎవరో కాదు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ గా పేరు సంపాదించుకున్న మంచు మోహన్ బాబు.

మన తెలుగు దిగ్గజ నటుడి పై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి దిగ్గజ నటుడితో పనిచేయడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అయితే తాజాగా సూర్య హీరోగా ‘సూరరాయి పోట్రు’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఇదే సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఛండీగఢ్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుది. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా షెడ్యూల్‌లో మోహన్‌‌బాబు పాల్గొన్నారు. శుక్రవారం ఆయన చిత్ర యూనిట్‌తో కలిశారు.ఈ సమయంలో నటుడు మోహన్ బాబు తో హీరో సూర్య చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే అవకాశం రావడంతో..... మోహన్ బాబు గురించి హీరో సూర్య తెలుసుకోవడానికి ఆయన వ్యక్తిత్వం, ఆహార్యం అలవాట్లు దగ్గరనుంచి చూసిన సూర్య ఆయన పై ఓ ట్వీట్ చేశాడు.సెట్స్‌లో మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం పై నటుడు సూర్య ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘గొప్ప క్రమశిక్షణ కలిగిన దిగ్గజం

మోహన్‌బాబు గారితో సెట్స్‌లో గడపడం ఎంతో అదృష్టం. ఒక గ్యారేజ్‌లో మొదలై దాదాపు 500 పైగా సినిమాల వరకు వెళ్లిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇదో అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ‘సూరరాయి పోట్రు’లో భాగమైనందుకు మీకు కృతజ్ఞతలు సార్’ అని సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే తాజాగా హీరో సూర్య ట్వీట్‌పై మోహన్‌బాబు కూడా స్పందించారు. ట్విట్టర్ ద్వారా సూర్యకు మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలుపుతూ ...... ‘ఇంత గొప్పగా చెప్పినందుకు థ్యాంక్యూ సూర్య. ఈ తరం టాప్ స్టార్లలో మీరు ఒకరైనప్పటికీ సెట్స్‌లో మీ క్రమశిక్షణ, విధేయత మీ గొప్ప క్యారెక్టర్‌ గురించి చెబుకనే చెబుతాయి. తరవాత షెడ్యూల్ గురించి వేచి చూస్తున్నాను, మై యంగ్ ఫ్రెండ్’ అని మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ సినిమాకు 'గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘ఎయిర్ డెక్కన్’ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈఈ సినిమాను నిర్మిస్తున్నారు. చూడాలి ఈ సినిమాతో చాలాకాలం తరువాత కోలీవుడ్ లో మోహన్ బాబు సినిమా రానున్నడం ఆయనకు ఎలాంటి పేరు తీసుకొస్తుంది అన్నది.