తెలుగుదేశం పార్టీకి విజయవాడలో కీలకమైన నేత దేవినేని అవినాష్, కగా గత ఐదారు రోజుల నుండి తన గురించి కొన్ని వార్తలు వినవస్తున్నాయి. అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి, వైసీపీ లోకి వెళ్ళబోతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వచ్చాయి. విజయవాడ సిటీలో బలం పెంచుకోవాలని చేసుతున్న వైసీపీ.. బలమైన నేతల కోసం గాలం వేస్తూ, అందులో భాగంగా మొదటి బోండా ఉమానీ అనుకున్నారు, ఆ తర్వాత వెంటనే దేవినేని అవినాష్ నీ తీసుకోవాలని అనుకోని చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక దీనిపై తాజాగా తెలుగుదేశం యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ "నేను పార్టీ మారుతున్నాను అని వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను టీడీపీనీ వదిలివెళ్లే ప్రసక్తి లేదు, ప్రజాసేవ చేయడానికి పదవులు అక్కర్లేదని, చిత్తశుద్ధి ఉంటే చాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు". దేవినేని అవినాష్ దీనితో పార్టీ మారిపోతాడు అనే వార్తలకి చెక్ పెట్టాడు.