Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవీశ్రీ ప్రసాద్ ఇంట పెళ్లి బాజాలు. దూరంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కారణమేంటి..

Category : movies

టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరైన "దేవీశ్రీ ప్రసాద్" ఇంట్లో తాజాగా పెళ్లి బాజాలు మ్రోగాయి. అయితే పెళ్లి పీఠలు ఎక్కింది మాత్రం దేవీశ్రీ ప్రసాద్ కాదు. ఆయన తమ్ముడు "సాగర్" రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్నాడు.ఈ విషయాన్ని దేవీశ్రీ ప్రసాద్ చాలా ఆలస్యంగా వెల్లడించాడు. తన తమ్ముడు సాగర్ వివాహాం డాక్టర్ మౌనికతో జరిగింది. దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఇతను సింగర్‌గా రాణిస్తున్నాడు.

ఇక దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడి వివాహాం గత నెల 19న జరిగింది. అయితే ఈ వేడుకకు దేవీశ్రీ ప్రసాద్‌కు చెందిన ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. టాలీవుడ్‌లో అందరి అగ్ర హీరోల ఫేవరేట్ సంగీత దర్శకుడైన దేవీశ్రీ ప్రసాద్ ఇంట్లో జరిగిన ఈ వేడుకకు ఎవరు హాజరు కాకపోవడం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్యర్యానికి గురి చేసింది. దేవీశ్రీ ప్రసాద్ కావాలనే ఈ వేడుకకు ఎవరినీ పిలవలేదననే టాక్ వినబడుతోంది.