//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాలంటీర్ల ఉద్యోగాల్లో అవినీతి..!

Category : state politics

అధికారంలోకి తమ ప్రభుత్వం కానీ వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రతీ ఒక్క రాజకీయ నాయకుడు ఓ రేంజ్ లో చెప్తూ ప్రజలను ఒక రేంజ్ లో మభ్యపెడతారు. అవి నమ్మి జనం ఓట్లేస్తే వారు ఆ తర్వాత వారికి నామం పెడతారు. ఇప్పుడు ఏపీ లో కూడా ఇలానే జరుగుతుందని చెప్పాలి. జగన్ అధికారంలోకి రాకముందు ప్రకటించిన వరాల జల్లులు అన్ని ఇన్ని కావు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే రాకముందు తను అసలు అవినీతికి చోటు ఇవ్వనని అంతే కాకుండా అవినీతి రహిత పాలన అంటే ఏమిటో చూపిస్తానని మళ్ళీ రాజన్న పాలనను తెస్తానని చెప్పుకొచ్చారు.

కానీ ఇప్పుడు వందలాది ఓట్లు వేసిన జగన్ మరియు వైసీపీ అభిమానులే ఆ పార్టీకు ఎందుకు ఓటేసానా అని బాధపడుతున్నారు. జగన్ ఏమో పైకి ఒకటి చెప్తుంటే కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇంకోటి జరుగుతుంది. జగన్ ఏమో అవినీతికి చోటు ఇవ్వను అని నా ఎమ్మెల్యే తప్పు చేసినా దాన్ని మీరు వీడియో తీసి పంపించండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అతను ఇచ్చిన గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల్లోనే భారీ అవకతవకలు జరుగుతున్నాయి. ఉద్యోగానికి అప్లై చేసిన వారికి కాకుండా స్థానిక ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒక లిస్ట్ ప్రకారమే ఉద్యోగాలు కేటాయిస్తున్నారని సదరు వైసీపీ ఓటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సరే ఉద్యోగం ఇవ్వలేదని ఇక్కడే అవినీతి జరుగుతుందని ఇంటర్వ్యూ కి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.