//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తన శరీరాన్ని 32 ముక్కలు చేసిన తాను బీజేపీ లో చెర బోననీ....స్పష్టం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Category : national politics

గుజరాత్ రాజకీయాల్లో ఓ వార్త ఇప్పుడు సంచలన ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లేననని....అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదే అంశం పై అక్కడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం స్పందించారు. తామందరం ఒకే తాటిపై ఉన్నామని, ఏ ఒక్క వ్యక్తి కూడా బీజేపీ పార్టీ లో చేరబోయేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అవన్నీ రాజకీయ పుకార్లేనని వాటిని కొట్టిపారేశారు అక్కడి ఎమ్మెల్యేలు.అంతే కాకుండా అందులో విక్రమ్ మదమ్ అనే ఎమ్మెల్యే ఏకంగా ఒక అడుగు ముందుకువేసి... నా శరీరాన్ని 36 ముక్కలుగా కోసినా బీజేపీ లో చేరానని కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు.

తాను ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడుపోనని, కొందరు పిచ్చివాళ్ళు బీజేపీ లోకి వెళ్తున్నారని.... తామంతా పార్టీ మారతాయని చెప్పడం పూర్తి అసత్యమని ఈ రకమైన ఉచిత ప్రచారం చేస్తున్న వారికి ఒకటే విన్నపం అని.తన చివరి శ్వాస వరకు తాను కాంగ్రెస్ లోనే కొన సాగుతానని చెప్పడం విశేషం.అలాగే మరో ఎమ్మెల్యే శివభాయ్ భూరియా మాట్లాడుతూ.... తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అది కేవలం ఉచిత ప్రచారమేనని, తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని ఆయన ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే తమ ఎమ్మెల్యే లను భారీ స్థాయిలో కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోంద నీ.ఇలాంటి తప్పుడు పనులు బీజేపీ నేతలు మానుకోవాలని కూడా వారు స్పష్టం చేశారు.