గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి కారణంగా ముంపు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు కు గురిఅవుతున్నారు, కాగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని ఆదివారం వెల్లడించారు. అంతే కాకుండా టీడీపీ కార్యకర్తలును ఈ సమయంలో ముందుకొచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పునరావాస, సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు.
వరద నీరు పొలాలు, ఇళ్లల్లోకి చేరటం ద్వారా అపార నష్టం వాటిల్లిందని, తాగునీరు అందక, కరెంటు లేక ప్రజలు అల్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలానే వరద ధాటికి మిర్చి, అరటి తోటలు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేరుకొన్నారు. కాగా టీడీపీ కార్యకర్తలు ఇలాంటి సమయంలో వరద బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. వారికీ సహాయ చర్యలు అందించాలని పిలుపునిచ్చారు.