కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు అడుగడుగునా సరికొత్త సమస్యలు వస్తూనేఉన్నాయి. కాగా అధికారం చేపట్టి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే జగన్ వైఖరి పై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు. ఇక ఈ విషయం పై స్వయంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఖాతా నుంచి చేస్తుండడం విశేషం. తాజాగా వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఒక అంగన్వాడి మహిళా ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మ హత్యా యత్నం చేసిన ఘటన బయటకు వచ్చింది.
ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వస్తే అరాచక శక్తులు ఎక్కువయ్యిపోతాయని చంద్రబాబు ఇది వరకే ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇక దీనిపై స్పందిస్తూ బాబు "ఏమిటీ రాక్షస పాలన? చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న మహిళలను ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ఘటనలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తెదేపా చూస్తూ ఊరుకోదు." సంచలన ట్వీట్ పెట్టారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం ఏమన్నా సంజాయిషీ ఇస్తుందేమో చూడాలి మరి.