//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రిటానియా పరిశ్రమ గోదాములో భారీ అగ్నిప్రమాదం..!

Category : business

ఈ తెల్లవారుజామున కృష్ణా జిల్లాలోని కొణతనపాడులో ఉన్న బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో అక్కడఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనలో దాదాపు పది కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.