Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ : ఫేమస్ క్రికెటర్ కన్నుమూత..!

Category : sports

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సేమౌరా నర్స్ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. 1960లో వెస్టిండీస్ జట్టులో ఆరంగేట్రం చేసిన ఆయన తన కెరీర్‌లో 29 టెస్ట్ మ్యాచులు ఆడారు. ఇందులో ఆరు శతకాలు, 10 అర్థ శతకాలతో 2,523 పరుగులు చేశారు. కాగా సేమౌరా నర్స్ మరణ వార్తని బార్బడోస్ క్రికెటర్ డెస్మండ్ హెన్స్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపాడు. ‘‘ఆయన నా కోచ్, మెంటార్. హోల్డర్స్ హిల్స్‌ ప్రాంతానికి చెందిన ప్రతీ ఒక్కరు ఆయన్ని ప్రేమిస్తారు. మేం ఆయనలా నడవటం, బ్యాటింగ్ చేయడం ప్రాక్టీస్ చేసేవాళ్లం. నాకోసం ఆయన చేసిన ప్రతీ విషయానికి ధన్యవాదాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను’’ అని డెస్మండ్ పోస్ట్ చేశాడు.

ఇక 1966లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో నర్స్ వెలుగులోకి వచ్చారు. ఈ సిరీస్‌లో ఐదు టెస్ట్‌లు ఆడిన ఆయన నాలుగు అర్థశతకాలు, ఒక శతకంతో 501 పరుగులు చేశారు. 1967లో ఆయనకు విస్డెన్ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌గా ఆవార్డు వచ్చింది. రిటైర్‌మెంట్ తర్వాత ఆయన బార్బడోస్ సెలెక్టర్‌గా, టీమ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక బార్బడోస్ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్‌లో చాలాకాలం కోచ్‌గా పని చేశారు. నర్స్‌ మృతిపై పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

Related News