//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్ : టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు

Category : state politics

ఎస్‌ఎన్‌పాడు మాజీ ఎమ్మెల్యే బి.ఎన్‌.విజయకుమార్‌కు ఆదివారం గుండెపోటు వచ్చింది. ఒంగోలులోని స్వగృహంలో ఉదయం ఆయనకు స్ర్టోక్‌రాగా స్వయంగా పట్టణంలోని జీఎస్‌ఆర్‌ అసుపత్రికి వెళ్ళారు. అక్కడనుంచి కిమ్స్‌ అసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు హుటాహుటిన యాంజియోగ్రామ్‌ చేసి తక్షణమే స్టెంట్‌ వేశారు. బీఎన్‌కు ఎటువంటి ప్రాణ ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు.

తమ అభిమాన నాయకుడుకు ఆసుపత్రిలో చేరారనేవార్త తెలియడంతో అభిమానులు , పలువురు నేతలు పెద్ద ఎత్తున కిమ్స్‌ అసుపత్రికి తరలి వెళ్ళారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, తెలుగుయువత నాయకులు కరణం వెంకటేష్‌ ఐసీయూలోఉన్న బీఎన్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైదులను అడిగి తెలుసుకున్నారు..