ఐసీసీ వన్డే ప్రపంచకప్లో తొలి సెమీస్ ఇవాళ జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. కెప్టెన్ కోహ్లీకి అచ్చొచ్చిన మాంచెస్టర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఈ నాకౌట్ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఏది ఫైనల్కు చేరుతుందో అని క్రికెట్ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.