Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీదేవి కోరిక నెరవేరింది...బోనీ కపూర్!

Category : movies

తమిళంలో తళా అజిత్ హీరోగా బోనీకపూర్ ఓ చిత్రాన్ని నిర్మించాలన్నది శ్రీదేవి కోరిక. శ్రీదేవి గారు చనిపోయే ముందు విష్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కోరికను నెరవేరుస్తున్నారు బోనీ కపూర్. తాజాగా అజిత్ హీరోగా ఆయన నిర్మించిన "నేర్కొండ పార్వాయ్" (పింక్ రీమేక్) తమిళంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. సింగపూర్ సహా తళా ఫ్యాన్స్ ఉన్న ప్రతిచోటా ఈ చిత్రం భారీగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లాంటి చోట్లా కూడా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఆగస్టు 8న రిలీజ్ కానుంది. సింగపూర్ లో ఆరోజు ఉదయం 9 గంటలకే ప్రీమియర్లు వేస్తున్నారట. కేవలం ఓవర్సీస్ లోనే 600 పైగా వర్చువల్ సోలో షోస్ తో ఈ సినిమా ప్రీమియర్లు ప్లాన్ చేశారట. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ రిలీజ్ సందర్భంగా బోనీ కాస్తంత ఎమోషనల్ గానే సోషల్ మీడియాలో స్పందించారు. అయితే అజిత్ సహకారం లేనిదే శ్రీదేవి చివరి కోరికను నెరవేర్చలేకపోయేవాడినేమో! అంటూ ఉద్వేగానికి గురయ్యారు బోనీ.

శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ తమిళ వెర్షన్ చిత్రీకరించేప్పుడు ఈ కోరికను కోరారు. అజిత్ హీరోగా ఓ తమిళ చిత్రం నిర్మించాలి అని బోనీని అడిగారు కాబట్టి ఆ కోరిక ఇప్పటికి నెరవేరుతోంది. ఈ సినిమాతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రేసింగ్ (స్పోర్ట్స్) కాన్సెప్ట్ తో వేరొక భారీ చిత్రాన్ని అజిత్ హీరోగా బోనీకపూర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ఇదవరికే ప్రచారమైంది.