//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం..! పార్టీ నుంచి నగేశ్ సస్పెండ్..

Category : state politics

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు మొత్తం ఖాళీ అవుతున్న సమయంలో అధిష్టానం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్న జరిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు అవకతవకలు జరగడంతో ఎంతో మంది విదార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలలో గ్లోబరీనా చేసిన తప్పుల వలన 23మంది విద్యార్థులు దాకా చనిపోయారు. అయితే విద్యార్థుల బలిదానాలకు నిరసనగా, ప్రతిపక్ష పార్టీలన్ని వారి తల్లిడండ్రులకు మద్ధతుగా నిలిచి టీఆరెస్‌పై విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. అందులోనే భాగంగా నాలుగు రోజుల కిందట ఇందిరా పార్కు వ‌ద్ద అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ధర్నాను చేపట్టారు. అయితే ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోదండరాం మరియు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో అందరూ చూస్తుండగానే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు మరియు కాంగ్రెస్ పార్టీ నేత నగేశ్ ముదిరాజ్‌ల మధ్య కుర్చీలో కూర్చునే విషయంలో తలెత్తిన ఈ వాగ్వివాదం ఒకరిపై ఒకరు పడి కొట్టుకునేంత వరకు వెళ్ళింది. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఇరు నేతల వాదోపవాదనలను బట్టి చూస్తే నగేశ్‌దే తప్పు అన్నట్లుగా ఒక అభిప్రాయానికి వచ్చింది. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం నగేశ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడినా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ విలవలను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది.