//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ సీజన్ -3 లో టిక్ టాక్ సెలబ్రెటీ......ఉప్పల్ బాలుకి చోటు

Category : national

మన దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ గుర్తింపు పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్. దాదాపు అన్ని భాషా ల్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచు కుంటున్న ఈ షో కి అంతట విపరీతమైన ఆదరణ లభిస్తోంది.అయితే ఇప్పటికే మన తెలుగు లో రెండు బిగ్ బాస్ సీజన్స్ విపరీతమైన స్పందన లభించింది. దానిలో భాగంగానే మూడో సీజన్ కూడా ఈ పాటికి ప్రారంభం కావలసి ఉండే....కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కొంత ఆలస్యంగా ఈ మూడో సీజన్ ప్రారంభం కానుంది.అలాగే ఈ షో లో పార్టిసిపెంట్స్ ఎంపికకూడా ఓ కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం అందులో కొందరిని మాత్రమే ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని అనధికారికంగా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో వరుణ్ సందేశ్, సింగర్ హేమ చంద్ర, సోషల్ మీడియా సెన్షేషన్ గాయత్రి గుప్తా ఇంకా టిక్ టాక్ ఫేమస్ ఉప్పల్ బాలు వంటి వారి పేర్లు బయటికి వచ్చాయి.

ఇక టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాలు గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆసక్తి కర చర్చ జరుగుతోంది. టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు ఉప్పల్ బాలు వాయిస్ లేదా ఉప్పల్ బాలు కనిపిస్తూనే ఉంటాడు. విభిన్నమైన బాడీలాంగ్వేజ్ తో పాటు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఉప్పల్ బాలు సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. టిక్ టాక్ వీడియోల కారణంగా ఉప్పల్ బాల్ ఓ స్టార్ సెలబ్రెటీ అయ్యాడు. అందుకే ఆయన్ను బిగ్ బాస్ సీజన్ -3 లోకి తీసుకునే యోచనలో స్టార్ మా యాజమాన్యం ఉన్నట్లు టాక్.అలాగే ఈ సారి బిగ్ బాస్ లో పాటిసిపెట్స్ గా పాల్గొనేందుకు...యాంకర్ లాస్య మరియు శ్రీముఖి.. సీరియల్ నటుడు జాకీ ఇంకా కొందరు బుల్లి తెరకు సంబంధించిన వారిని కూడా ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీమఖి బిగ్ బాస్ కోసం పటాస్ కు బ్రేక్ ఇచ్చినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. మొదట సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు మూడవ సీజన్ కు నాగార్జున ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో సీజన్-3 కి సంబంధించిన ప్రకటన రాబోతుంది.