//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం జ‌గ‌న్ స‌ర్కారే..?

Category : state politics

టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ మ‌రోసారి వైసీపీ నేతల‌ తీరు పై విరుచుకుప‌డ్డారు. వైసీపీలోని ఒక్కో ముఖ్య నేత గురించి త‌న మాట‌ల్లో క్షుణ్ణంగా వివ‌రించారు. ముందుగా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి గురించి బాబు రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడారు. ఆయన గురించి త‌న‌కంటే ప్ర‌జ‌ల‌కే ఎక్కువ తెలుస‌న్నారు. ఎటువంటి అరాచ‌క‌వాదో.. ఎటువంటి రౌడీయిజం చేస్తాడో.. ఏంట‌న్న విష‌యాలు ఏపీలోని ప్రతి ఒక్క‌రికి తెలుస‌న్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి మాట్లాడుతూ టీడీపీ హ‌యాంలో రోజాను ఏమ‌న్నా అరెస్టు చేశామా..? అని ప్ర‌శ్నించారు.

రోజా అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుకు అడ్డుప‌డుతున్న కార‌ణంగా, గొడ‌వ చేస్తున్న రోజాను తీసుకెళ్లి గౌర‌వంగా ఇంటి వ‌ద్ద వ‌దిలిపెట్టామ‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఏనాడు కూడా ఊళ్ల‌కు ఊళ్లు తరిమేయలేదు, చివ‌ర‌కు పున‌రావాస పెట్టనటువంటి దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇది వ‌ర‌కు రాష్ట్ర రాజ‌కీయాల్లో, దేశ రాజ‌కీయాల్లో చోటు చేసుకోన‌టువంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని బాబు రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. ఆశావ‌ర్క‌ర్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు చిన్న చిన్న ఉద్యోగులంద‌ర్నీ ఉద్యోగాల‌కు రాజీనామాచేసి వెళ్ల‌కుంటే మీ అంతు చూస్తామంటూ వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నార‌ని, వారు వారి నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల పేర్ల‌ను పేప‌ర్‌లోరాసి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరును బాబు రాజేంద్ర ప్ర‌సాద్ వెల్లడించారు.