//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణీ కుటుంబ నేపథ్యం....ఆమె తండ్రీ ఎవరో తెలుసా....?

Category : politics

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సరి కొత్త అధ్యాయాన్ని లిఖించి పార్టీ వైసీపీ. అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వచ్చి చరిత్ర పుటలకెక్కిన ఆ పార్టీ లో నూతనంగా కొలుతిరిన మంత్రి వర్గ విస్తరణ లో పలు ఆసక్తి కరమైన అంశాలు నెలకొన్నాయి.జగన్ క్యాబినెట్లో మొట్ట మొదటి మహిళా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి.ఆమె సొంతూరు బుట్టేయగూడెం మండలం దొర మామిడి గ్రామం వరుసగా రెండోసారి వైకాపా తరపున ఎమ్మెల్యే గా గెలిచిన ఆమె. మరో మారు అదే ప్రాంతం నుంచి గెలిచి వై.ఎస్ జగన్ మంత్రివర్గంలో లో చోటు సంపాదించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించు కోవడం విశేషం. ఈమె పుట్టి పెరిగిన పోలవరం నియోజకవర్గం నుంచి ఓ మహిళ నాయకురాలి కి ఇటువంటి అత్యున్నత పదవి దక్కడం పై అక్కడి స్థానికుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్ని అంటాయి.వాస్తవానికి ఆమె విజయనగరం రాజుల కోటలో గెలిచినప్పటికీ, ఆమె ఎప్పటికీ తమ బిడ్డ గానే భావిస్తామని ఆమె పుట్టి పెరిగిన పోలవరం వాసులు ఆమెకు దక్కిన పదవి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన పెళ్లి అయ్యేవరకు ఇక్కడే పుట్టి పెరిగిన పుష్ప శ్రీ వాణీ. ఇప్పుడు ఓ మంత్రి గా ఎదగడం చూస్తున్న అక్కడి వారిలో ఆనందం కట్టలు తెంచుకుందనే చెప్పుకోవాలి.

గతంలో ఆమె ఇక్కడి గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకునీ ఆ తరువాత ఇంటర్ డిగ్రీలను జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో పూర్తి చేయడం విశేషం.పుష్ప శ్రీ వాణి తండ్రి అక్కడే ఉండే గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా చేరి, ఆ తరువాత ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొంది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగిగా ఉంటున్నారు.ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు...ఒక కుమారుడికి జన్మనిచ్చారు.మొదటి నుంచి కూడా తన నలుగురు సంతానానికి ఏనాడు ఏ లోటూ లేకుండా వారిని పెంచి పెద్దవారిని చేశాడు. అంతే కాకుండా వారి ప్రతి అభ్యున్నతి లోనూ ఆయన పాత్ర అనిర్వచనియం.అంతే కాకుండా ఆయన తన ముగ్గురు కూతుళ్లను కూడా విజయనగరానికే చెందిన వ్యక్తులకు ఇచ్చి వివాహం జరిపించారు . ఇందులో ముఖ్యంగా పుష్ప శ్రీ వాణి విజయనగర రాజుల కోటలో అడుగుపెట్టడానికి పెద్ద కారణమే ఉంది. విజయనగరం అబ్బాయి తో ఆమె అక్క పెళ్లయింది . అక్క ఇంటికి వెళుతున్న పుష్ప శ్రీ వాణి శత్రుచర్ల కుటుంబీకులకు కనిపించింది దాంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తో ఆమె వివాహం జరిపించారు. తద్వారా ఆమె వివాహం కూడా అక్కడి స్థానిక వ్యక్తితో వివాహం జరిగింది.