హైదరాబాద్‌లో "ఓఫు క్యాబ్స్" టాక్సీ సర్వీస్ తన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ నెల 15వ తేదీ నుంచి క్యాబ్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని సంస్థ వ్యవస్థాపకులు అరుణ్, ప్రాష్, సిద్ధార్ధ, కృష్ణ వెల్లడించారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యాబ్‌లకు భిన్నంగా ఇరవై నాలుగు గంటలు స్థిరమైన ధరలతో, ప్రయాణ సమయంతో సంబంధం లేకుండా కిలోమీటర్ల లెక్కన "ఓఫు క్యాబ్స్" సేవలందించనుందని వారు చెప్పారు.
4 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.79 చార్జీతో సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.ఓఫు క్యాబ్స్‌తో ఇప్పటికే 900 మంది డ్రైవర్లు ఒప్పందం కుదుర్చుకున్నారని,అతి త్వరలో మరో 3,500 క్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు చెప్పారు.ఓఫు క్యాబ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా తమ క్యాబ్ సేవలను పొందవచ్చని వారు పేర్కొన్నారు.కాగా డ్రైవర్లకు రూ.15 లక్షల వరకు ప్రమాద బీమాను సంస్థ తరపున ఇస్తున్నట్లు వారు చెప్పారు.