//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సిద్ధార్థ మృతి పై భావోద్వేగ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

Category : business

మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మ గౌరవాన్ని నాశనం చేసే చాన్స్ ఇవ్వొద్దని, దాని వలన పారిశ్రామికం అంతమైనట్టేనని వెల్లడించారు.

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా "నాకు ఆయన గురించి తెలియదు. ఆయన ఆర్థిక పరిస్థితుల గురించి కూడా అవగాహన లేదు. కానీ నాకు తెలిసిందల్లా పారిశ్రామిక వేత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మగౌరవాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వొద్దు. ఇది పారిశ్రామికరంగం అంతానికి దారి తీస్తుంది.." అని ట్వీట్ చేశారు.

సోమవారం సాయంత్రం మంగళూరులో 58 ఏళ్ల వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. ఓ జాలరి నేత్రావతి నదిలోకి ఎవరో దూకడం చూశానంటూ చెప్పటంతో అక్కడకు పోలీసులు, కోస్టు గార్డులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని మంగళవారం గాలింపు జరిపాయి. విస్తృత గాలింపు అనంతరం ఇవాళ ఉదయం వీజీ సిద్ధార్థ మృతదేహం లభించింది. వీజీ సిద్ధార్థ తన సూసైడ్ నోట్‌లో ఆదాయ పన్ను శాఖ వేధింపులు, వ్యాపారంలో నష్టాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నానంటూ పేరుకొన్నారు.