//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లిబియాలో వైమానిక బాంబు దాడి..40మంది మృతి

Category : editorial

లిబియాలో మంగళవారం రాత్రి వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 40 మంది మృత్యువాత పడ్డారు. మరో 80మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలోని వలసదారుల పునరావాస కేంద్రంపై నిన్న రాత్రి ఈ దాడి జరిగింది. మృతుల్లో చాలా మందిని అఫ్రికా వలసదారులుగా గుర్తించారు. ఈ దాడి సమయంలో కేంద్రంలో దాదాపు 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య

శాఖ మంత్రి ప్రకటించారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. అయితే ట్రిపోలి తూర్పు భాగాన్ని అధీనంలోకి తీసుకొని పాలిస్తున్న లిబియన్ నేషనల్ ఆర్మీయే(ఎల్ఎన్ఏ) ఈ దాడికి పాల్పడిందని ఆ దేశ ప్రధాని ఫయాజ్ అల్ సెర్రా ఆరోపించారు.లిబియా దేశాధినేత గడాఫీని 2011లో హతమార్చిన నాటి నుంచి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ఐరాస గుర్తించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఎల్ఎన్ఏగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.