//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు. 93 లక్షల రూపాయలు సీజ్..!

Category : politics state

రెండేళ్ల క్రితం ఉత్తమ తహసీల్దార్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు దాచి ఏసీబీకి చిక్కారు. లంచం సొమ్ము తీసుకుంటుండగా చిక్కిన వీఆర్వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు అక్కడ బయటపడిన నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. పట్టుబడిన నగదు ఏకంగా రూ.93 లక్షలుగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు.

ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీస్థాయిలో నగదు పట్టుబడటం గడచిన పదేళ్లలో ఇదే తొలిసారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి భాస్కర్ అనే ఒక రైతు తన 9.07 ఎకరాల పొలానికి కేటాయించిన నంబర్ సర్వేల్లో లేదని, దాన్ని సవరించాలని కోరుతూ కొద్ది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

"కొందుర్గు" వీఆర్వోగా పనిచేసే అనంతయ్య నాకు 8 లక్షల లంచం ఇస్తేనే పని చేస్తానంటూ భాస్కర్‌ను వేధిస్తున్నాడు. తనకు రూ.5 లక్షలు, తహసీల్దార్ లావణ్యకు రూ.3 లక్షలు ఇస్తే నీ పని వెంటనే పూర్తయిపోతుందని చెప్పాడు. ప్రభుత్వ పరంగా చేసే పనికోసం లంచం ఎందుకు ఇవ్వాలని తనని తానే ప్రశ్నించుకున్న భాస్కర్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు చెప్పినట్లుగా బుధవారం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి వీఆర్వో అనంతయ్యకు రూ.4 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.