కేసీఆర్ తెలంగాణ కేబినేట్ ను పూర్తిగా చేయలేదు. రెండోసారి కూడా ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావోస్తున్న ఇంకా పూర్తి చెయ్యలేదు. ఇదిలా ఉంటేమరికొద్ది రోజుల్లోనే తన సొంతూరు చింతమడకలో పర్యటించబోతున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. మంచి రోజులు వచ్చిన వెంటనే కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణను చేపడతారని టీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.
కేసీఆర్ ఎప్పుడు మంత్రివర్గ చేపడతారనే ఆసక్తి ఓ వైపు… విస్తరణ చేపడితే అందులో మాజీమంత్రి హరీశ్ రావుకు చోటు ఉంటుందా అన్న సందేహాలు మరోవైపు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో హరీశ్ రావు, కేటీఆర్‌లను దూరం పెట్టిన కేసీఆర్… ఈ సారి వారిని కేబినెట్లోకి తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా కార్యకర్తలు నిరాశతో ఉన్నారని, అయితే త్వరలోనే మన నాయకుడికి మంచి పదవి వస్తుందని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్ నాయకునేత రాధాకృష్ణశర్మలు అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో శుభవార్త వింటామని వారు చెప్పారు.