//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాజల్‌ను కలుసుకోవాలంటే 60 లక్షలు..?

Category : movies

టాలీవుడ్ నటి కాజల్‌ను కలుసుకునే అవకాశం కల్పిస్తానంటూ ఓ యువ పారిశ్రామికవేత్త వద్ద ఏకంగా రూ.60 లక్షలు నొక్కేశాడో తమిళ నిర్మాత. పోలీసుల కథనం ప్రకారం.. రామనాథపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు (27) ఓ వెబ్‌సైట్ చూస్తుండగా సినీ తారల అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆసక్తికొద్దీ కాజల్ అగర్వాల్ ఫొటోపై క్లిక్ చేస్తే ఆమెను కలుసుకునేందుకు రూ.50 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం వారు సూచించిన ఖాతా నంబరులో అంత మొత్తాన్ని జమచేశాడు.

ఆ తర్వాత వెబ్‌సైట్ నిర్వాహకులు కాజల్‌ను కలుసుకునే అవకాశం కల్పించకపోగా, మార్ఫింగ్ చేసిన అసభ్యకర వీడియోలు, ఫొటోలను పంపి బెదిరించడం మొదలుపెట్టారు. అడిగినంత ఇవ్వకుంటే వాటిని కుటుంబ సభ్యులకు పంపిస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన యువకుడు ఏకంగా రూ.60 లక్షలు వారికి సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి నుంచి హెచ్చరికలు వస్తుండడంతో ఇంటి నుంచి పారిపోయాడు.

కుమారుడు కనిపించకపోవడంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత యువకుడు కోల్‌కతాలో ఉన్నట్టు గుర్తించి తీసుకొచ్చారు. దర్యాప్తులో వెబ్‌సైట్ నిర్వాహకుల మోసం బయటకు వచ్చింది. దీంతో అతడు డబ్బు జమచేసిన ఖాతా నంబరు ఆధారంగా మణికంఠన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో ఓ సినీ నిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.