Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుక్మా జిల్లా లో భారీ ఎన్ కౌంటర్ .. నలుగురు మావోలు మృతి

Category : world

చత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చింతల్ నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఈరోజు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా వారి వద్ద నుండి ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిల్ లను స్వాధీనం చేసుకున్నారు సీఆర్పీఎఫ్ పోలీసులు. మృతి చెందిన మావోయిస్టు ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది.

Related News