//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వలంటీర్‌ అభ్యర్థులకు 35 రకాల సేవలను అప్పగించనున్న ప్రభుత్వం...!

Category : politics state

ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లక్షలాది మంది గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియ నిబంధనల చక్రంలో చిక్కుకుందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వలంటీర్‌గా నియమితులయ్యేవారిని పనితీరు ఆధారంగానే కొనసాగించనున్నారు. ఏడాదిపాటు వారి పనితీరును పరిశీలించి, బాగుంటేనే వారిని విధులలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక ఇప్పుడు అభ్యర్థులు 9 రకాల నిబంధనలతో 35 రకాల పనులు చేయాల్సి రావడంతో మొదటి లోనే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అనుగుణంగా ఇప్పుడు వలంటీర్‌గా నియమితులయ్యే వారికి నియామక పత్రం ఇవ్వడానికి బదులు ఒప్పంద పత్రం ఇస్తుండడం గమనార్హం. సమాజ సేవా భావము కలిగిన అర్హులైన నిరుద్యోగ యువత నుంచి గ్రామ వలంటీర్లుగా పనిచేయుటకు దరఖాస్తు స్వీకరించి ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా గుర్తించుట జరిగింది.

ఈ ప్రక్రియలో గ్రామ వలంటీరుగా అర్హత సాధించినారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము అని గ్రామ వలంటీరుకు నియామక ఉత్తర్వులకు బదులుగా ఎంపీడీవోలు ఇలాంటి పత్రాలను పంపుతున్నారు. వలంటీర్లకు కేవలం సామాజిక సేవ అనే అంశాన్ని ప్రాధాన్యతగా చూస్తున్నం అని సమాచారం పంపుతున్నారు. ఇక దీంతోపాటు నవ నియమాలను పొందుపరిచారు. వీటికి అభ్యర్థి అంగీకరిస్తే సంతకం పెట్టి ఎంపీడీవోకు అందించాలి అని చెప్పారు. దీని పక్కన ఎంపీడీవో సంతకం చేసి ఒక నకలు వలంటీరుకు అందజేస్తారు. అంటే ఇక ఇప్పుడు ఎంపీడీవో, వలంటీరు మధ్య పరస్పర అవగాహనతో ఒక ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతానికి వలంటీరుకు 35 రకాల సేవలను అప్పగించనున్నారు. ఇక ఈ నెల 5 నుంచి 8 వరకు బ్యాచ్‌లవారీగా మండల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.